273 సీట్లతో 'ఇండియా' కూటమి గెలుస్తుంది: ఖర్గే

70చూసినవారు
273 సీట్లతో 'ఇండియా' కూటమి గెలుస్తుంది: ఖర్గే
లోక్‌సభకు ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో 'ఇండియా' కూటమి ఆధిక్యంలో ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. మొత్తంగా 273కు పైగా సీట్లను తమ కూటమి గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వాళ్లు (కేంద్రం) ఎంతగా తమను వేధించినప్పటికీ తాము ఈ ఎన్నికల్లో గెలువబోతున్నామని, ఎన్డీయే దారుణంగా చతికిలపడనుందని జోస్యం చెప్పారు. బీజేపీ చెబుతున్న '400 ప్లస్' లక్ష్యం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్