భారత్‌ - ఆసీస్‌.. హెడ్ టూ హెడ్ ఇలా..!

50చూసినవారు
భారత్‌ - ఆసీస్‌.. హెడ్ టూ హెడ్ ఇలా..!
అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో భారత్‌ - ఆసీస్‌ 30 సార్లు హెడ్ టూ హెడ్ తలపడ్డాయి. వీటిలో 19 టీమిండియా విజయం సాధించగా.. 11 కంగారూలు గెలిచారు. టీ20 ప్రపంచకప్‌ల్లో ఆసీస్‌-భారత్‌ ఐదుసార్లు తలపడ్డాయి. వీటిల్లో 2007, 2014, 2016లో భారత్‌ గెలిచింది. ఆసీస్‌ 2010, 2012లో గెలిచింది. ఇక ఈ టోర్నీలో గత ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓటమనేది లేకుండా దూసుకుపోతోంది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. మరోవైపు ఆసీస్‌ గత మ్యాచ్‌లో ఆఫ్గాన్‌ చేతిలో ఓటమి చవిచూసింది.

సంబంధిత పోస్ట్