భారత్ - బంగ్లాదేశ్‌ టెస్టు.. రెండో రోజు వర్షార్పణం

76చూసినవారు
భారత్ - బంగ్లాదేశ్‌ టెస్టు.. రెండో రోజు వర్షార్పణం
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడి అంతరాయం కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు ఒక్క బంతి కూడా ఆట సాగలేదు. వర్షం వస్తూ ఆగుతూ ఉండటంతో మైదానం చిత్తడిగానే ఉంది. దీంతో మ్యాచ్‌ నిర్వహణకు సాధ్యం కాదనే ఉద్దేశంతో అంపైర్లు మ్యాచ్ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం నుంచి మైదానంలో కవర్లను కప్పి ఉంచారు. రేపు ఆట జరిగే అవకాశం ఉంది. అయితే సజావుగా సాగడం అనుమానమే అనిపిస్తోంది. వర్షం ముప్పు కూడా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్