అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ‘ఇండియా డే పరేడ్’ నిర్వహించారు. నగరంలోని తూర్పు 38వ వీధి నుండి తూర్పు 27వ వీధి వరకు మాడిసన్ అవెన్యూలో కవాతు సాగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రకారం, కవాతులో 40కి పైగా ఫ్లోట్‌లు, 50కి పైగా కవాతు బృందాలు, 30కి పైగా కవాతు బ్యాండ్ లతో పాటు ప్రముఖులు, ముఖ్య అతిధులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠి, జహీర్ ఇక్బాల్, భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పాల్గొన్నారు.