జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టీ20 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇవాళ కోల్‌కతా చేరుకున్నాయి. మూడేళ్ల తర్వాత ఈ మ్యాచ్ ఏర్పాటు చేయడంతో ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.