ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లలో అధిక స్థాయిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. గుడ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్లలో ఉండే కోలిన్ అనే పోషకపదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కోడిగుడ్లలోని ఐరన్ గర్భిణీలకు, బాలింతలకు బాగా ఉపయోగపడుతుంది. గుడ్లలో ఉండే పోషకాలు.. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.