2036 నాటికి భారత జనాభా 152.2 కోట్లకు చేరుకుంటుందని, లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 952 మంది మహిళలుగా ఉంటుందని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పడుతోందని, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం, ఎన్నికలలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని తేల్చింది.