భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది: కేంద్రం

68చూసినవారు
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది: కేంద్రం
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాలపై వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికను వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో భారత్ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొంది. 2025-26లో భారత వృద్ధి రేటు 6.7గా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి 2.7 శాతంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో భారత్ విశేషమైన పనితీరు కనపర్చడం గమనార్హం.

సంబంధిత పోస్ట్