భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ త్వరలోనే జరగబోయే ఇంగ్లండ్ టీ20 సిరీస్‌కు రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫిట్‌గా ఉన్న షమీ తన ప్రాక్టీస్ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నాడు. గత కొన్ని సిరీస్‌లకు దూరంగా ఉన్న షమీ ఈ సిరీస్‌కు తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక, ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.