ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న నేపథ్యంలో ఆ దేశ మార్చింగ్ కంటింజెంట్ కర్తవ్యపథ్‌లో సందడి చేసింది. ఇండోనేషియా సైనిక అకాడమీ (అక్మిల్)కి చెందిన 190 మంది సభ్యుల బ్యాండ్ ‘జెండరాంగ్ సలింగ్ కాంకా లోకనాంతా’ కవాతు చేసింది. ఆ దేశ సాయుధ బలగాల్లో అన్ని శాఖలకు చెందిన 152 మంది సిబ్బంది ఈ బ్యాండ్‌లో భాగంగా ఉన్నారు.