త్రివేణి సంగమం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

70చూసినవారు
త్రివేణి సంగమం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో త్రివేణి సంగమాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో గోదావరి, మంజీర, హరిద్ర నదుల త్రివేణి సంగమం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్‌లోని కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమం ఉంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని సంగంలో నాగావళి, వేగావతి, సువర్ణ ముఖి నదులు కలుస్తాయి. కర్నూలులోని సంగమేశ్వరలో కృష్ణా నదిలో తుంగభద్ర, భవనాసి నదులు కలుస్తాయి.

సంబంధిత పోస్ట్