తెలంగాణ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. మరి కాసేపట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.