పసుపు బోర్డుకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: జీవన్ రెడ్డి

85చూసినవారు
పసుపు బోర్డుకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: జీవన్ రెడ్డి
నిజామాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేసిన పసుపు బోర్డును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా పసుపుకు మద్దతు ధర కల్పించడంతో పాటు మార్కెటింగ్‌ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు సైతం కల్పించాలన్నారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తూ బోర్డుకు ప్రత్యేక నిధి కేటాయించాలని సూచించారు. అంతేకాకుండా నిజామాబాద్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని కేంద్రం పునఃప్రారంభించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్