చేగువేరా స్ఫూర్తి: ప్రమాదానికి ఎదురు వెళ్ళే జార్జ్ రెడ్డి

540చూసినవారు
చేగువేరా స్ఫూర్తి: ప్రమాదానికి ఎదురు వెళ్ళే జార్జ్ రెడ్డి
ప్రముఖ విప్లవకారుడు చేగువేరా స్ఫూర్తిని గుండెలనిండా నింపుకుని పీడిత ప్రజల పక్షాన విద్యార్థి ఉద్యమాల నిర్మాణానికి పూనుకున్న ఉస్మానియా అగ్నికణం. సాధారణంగా నాయకులు ముందుగా అనుచరులను పంపి వ్యవహారం చక్కబెట్టమని చెబుతుంటారు. కానీ జార్జ్‌ మాత్రం అలా కాదు. ప్రమాదం ఎక్కడ ఉంటే అక్కడ తానే ముందు ఉండేవాడు. తరువాతే అనుచరులను పిలిచేవాడు. అటువంటి లక్షణం చేగువేరాలో ఉండేది. తరువాత అది జార్జ్ రెడ్డికే సొంతం. అందుకే జార్జ్ రెడ్డిని అభినవ చేగువేరా అని పిలుస్తారు.

సంబంధిత పోస్ట్