బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

4088చూసినవారు
బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మారుస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హన్మకొండలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయనతో పలువురు కార్యకర్తలు మీరే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ కంటతడి పెట్టుకున్నారు. దీంతో బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని సభకు తాను అధ్యక్షుడి హోదాలో వస్తానో లేదో అన్నారు. హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్