భారతదేశంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనే పథకం. ఈ పథకం కింద గర్భవతులకు భారత ప్రభుత్వము రూ.11,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. దేశంలో ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన మహిళలు ఈ ఆర్థిక సహాయం పొందుతారు. ఈ పథకాన్ని భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది.