పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండె ఆగిపోతుంది అంటూ మూసీ బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కంటిమీద కునుకు ఉండట్లేదని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ ప్రతిపక్షాలను కోరుతున్నారు. ప్రభుత్వం తమ ఇళ్ల జోలికి రావొద్దని.. తమ జీవితాలని రోడ్డుపాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.