2017 ఒప్పందం ప్రకారం జార్ఖండ్ యూనిట్ నుండి విద్యుత్‌ను ఎగుమతి చేసే అదానీ గ్రూప్‌తో సహా భారతీయ వ్యాపార సంస్థలతో తమ దేశం చేసుకున్న ఒప్పందాలను పరిశీలించడానికి ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదానీ ఒప్పందంలోని నిబంధనలు, విద్యుత్ కోసం చెల్లిస్తున్న ధర సరైనదేనా అని తెలుసుకోవడానికి ఈ ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.