గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని చెప్పారు. ‘గ్రీన్‌కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్ చేయనుంది. ఈ ప్లాంట్‌పై రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోంది. ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు’ అని తెలిపారు.