ఓ షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన కోతి ఓ మహిళను ముప్పతిప్పలు పెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఓ మాల్‌లోకి ఓ కోతి దూరింది. అక్కడ నానా రచ్చ చేసింది. ఓ మహిళా కస్టమర్‌పై దాడి చేసి ఆమె షూ లాక్కుంది. అలాగే ఆమె తలపైకి దూకి కొద్దిసేపు అక్కడే కూర్చుంది. ఆ కోతిని బయటకు పంపించేందుకు కస్టమర్లు, సిబ్బంది నానా ఇబ్బంది పడ్డారు.