సోనియా ఆకుల తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొని కొద్ది వారాలకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇకపోతే సోనియా త్వరలో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు యష్‌తో ఈనెల 21న మధ్యాహ్నం 3.40 గంటలకు వివాహం జరగనుంది. తమ వివాహానికి రావాలంటూ ఈ జంట హీరో నాగార్జునకు వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించారు. ఈ వీడియోను యష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.