సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు ఓ యువతిని పట్టుకుని కారు డిక్కిలోకి ఎక్కించారు. అదే సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించిన యువతి ఫ్రెండ్ డ్రైవర్ సీటులలోకి ఎక్కి కారుతో సహా వెళ్ళిపోయింది. దీంతో కిడ్నాపర్స్ షాక్ అయ్యారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు యువతి సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.