ఐఫోన్ 16, 16 ప్లస్‌లో 6.1, 6.7 అంగుళాల స్క్రీన్‌లను అందించింది. దీనితో పాటు కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా ‘విజువల్ ఇంటెలిజెన్స్’తో మాక్రో ఫొటోలు, స్పేషియల్ ఫొటోలు/వీడియోలు తీసుకోవచ్చు. 48 ఎమ్‌పీ ప్రధాన కెమెరా ఉంటుంది. డాల్బీ విజన్‌లో 4కే60 వీడియోను తీసుకోవచ్చు. వీడియోల్లో గాలి ధ్వనిని తగ్గించొచ్చు. ఐదు రంగుల్లో లభ్యమవుతున్న ఈ ఫోన్లు ఈనెల 20 నుంచి కొనుగోలు చేయొచ్చు.