యాపిల్ ఈవెంట్‌లో టిమ్ కుక్‌తో ముచ్చటించిన లవ్ బర్డ్స్ సిద్ధూ, అదితి రావ్

65చూసినవారు
యాపిల్ ఈవెంట్‌లో టిమ్ కుక్‌తో ముచ్చటించిన లవ్ బర్డ్స్ సిద్ధూ, అదితి రావ్
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్ ఈవెంట్‌కు లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హాజరయ్యారు. అక్కడ యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ను కలిసి ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టిమ్‌ కుక్‌తో ఈ జోడీ ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను ఇరువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఈ రోజును ఎప్పటికీ మర్చిపోము. టిమ్‌ కుక్‌ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ వారు పోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌లో న్యూ ఐఫోన్ 16ని వారు కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్