తెలుగు రాష్ట్రాలకు సహాయం చేసిన తమిళ హీరో శింబు

552చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు సహాయం చేసిన తమిళ హీరో శింబు
త‌మిళ న‌టుడు శింబు రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. భారీవర్షాలకు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తనవంతు సాయంగా రూ.6 లక్షలు విరాళం అందిస్తున్నట్లు తమిళ నటుడు శింబు ప్రకటించారు. తెలంగాణ, AP సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇతర ఇండస్ట్రీల నుంచి స్పందించిన నటుడు ఆయనొక్కరేనని నెటిజన్లు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్