యాపిల్ సంస్థ నుంచి లేటెస్ట్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ 16ఈ లాంచ్ అయిన నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో 3 ఫోన్లకు గుడ్‌బై చెప్పింది. 2022లో లాంచ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఎస్‌ఈ మోడళ్లను యాపిల్ తన అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. థర్డ్ పార్టీ రిటైల్ స్టోర్లు అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి స్టోర్లలో మాత్రం ఈ మోడల్స్ అందుబాటులో ఉంటాయి. స్టాక్ పూర్తయితే అవీ మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగయ్యే అవకాశముంది.