రేపు ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

55చూసినవారు
రేపు ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనుంది. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో 72,045 ఇందిరమ్మ ఇళ్లకు CM రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. 'ఇందిరమ్మ ఇళ్ల'లో భాగంగా ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేయనుంది. బేస్మెంట్ కట్టగానే లబ్ధిదారుడి ఖాతాలోకి రూ.లక్ష జమ చేయనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్