ఐపీఎల్: నేడు ఓడితే ఇంటికే!

59చూసినవారు
ఐపీఎల్: నేడు ఓడితే ఇంటికే!
ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ 12 పాయింట్ల మీద ఉన్నాయి. ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా.. లక్నోకు ముంబైతో మరో మ్యాచ్ మిగిలుంది. అయితే హైదరాబాద్‌తో ఓటమి తర్వాత లక్నో రన్ రేట్ ఘోరంగా పడిపోయింది. దీంతో ప్లేఆఫ్స్ బెర్త్ అనుమానమే. ఇక ఢిల్లీ ఈరోజు గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కు ఎంతోకొంత ఛాన్స్ ఉంటుంది. ఓడితే ఢిల్లీ కూడా ఇంటికే.

సంబంధిత పోస్ట్