గన్ తో కాల్చుకొని ఐపీఎస్ అధికారి ఆత్మహత్య

527642చూసినవారు
గన్ తో కాల్చుకొని ఐపీఎస్ అధికారి ఆత్మహత్య
ఐపీఎస్ అధికారి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. కోయంబత్తూరు డీఐజీ విజయకుమార్ తన ఇంట్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2009 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన విజయ్ కుమార్, గత జనవరిలో కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. కాంచీపురం, కడలూరు, నాగపట్నం మరియు తిరువారూరు జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్