హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్
సమంత ఒంటరిగా ఉంటోంది. వ్యక్తిగత జీవితంలోని ఒడిదొడుకులను తట్టుకుని ధైర్యంగా కెరీర్‌లో నిలదొక్కుకుంటోంది. తాజాగా
సమంత ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. ‘ఒకవేళ మరణం నుంచి మనల్నీ ఏదీ కాపాడలేకపోయినప్పుడు కనీసం ప్రేమైనా బాధల నుంచి కాపాడాలి’ అని ప్రఖ్యాత రచయిత పాబ్లో నెరుడా చెప్పిన మాటలను
సమంత షేర్ చేసింది. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో
సమంత ప్రేమరాహిత్యంతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.