ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా: BJP ఎంపీ లక్ష్మణ్‌

74చూసినవారు
ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా: BJP ఎంపీ లక్ష్మణ్‌
కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని BJP ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. రైతులకు వరి పంట బోనస్‌ ఇవ్వలేదని, వచ్చే సీజన్‌కు ఇస్తామంటున్నారని చెప్పారు. ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని ఎద్దేవా చేశారు. రైతు స్వరాజ్య వేదిక, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారన్నారు. కానీ మంత్రి ఉత్తమ్‌ ఆత్మహత్యలే లేవని చెబుతున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో సీఎం సమాధానం చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్