గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత ముమ్మరం చేసింది. తాజాగా ఉత్తర గాజాలో వైమానిక దాడికి దిగింది. జబలియాలోని అబు హుస్సేని స్కూల్ వద్ద జరిపిన ఈ దాడిలో 15 మంది మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మరి కొంతమంది గాయపడ్డారని వెల్లడించింది. వీరిలో అనేకమంది మహిళలు, చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది.