తిరుపతి లడ్డూ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. దేవుడి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు, చేప నూనెను వాడి మన ధర్మం, దేవుడితో ఆడుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. జగన్ ఒక పాపపు ముఖ్యమంత్రి అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆయన కోరారు. ఈ చర్యతో పవిత్రమైన మన సంప్రదాయాలను అవమానించారని అన్నారు.