రెడ్‌ బుక్‌ తెరవకముందే జగన్‌ గగ్గోలు పెడుతున్నారు: లోకేశ్‌

71చూసినవారు
రెడ్‌ బుక్‌ తెరవకముందే జగన్‌ గగ్గోలు పెడుతున్నారు: లోకేశ్‌
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్‌ బుక్‌లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. రెడ్‌ బుక్‌ తెరవక ముందే జగన్‌ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రెండు ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్‌.. 11 సీట్లు వచ్చిన నెలలోపే ఐదు ప్రెస్‌మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్‌ చెప్పే అసత్యాలకు అసెంబ్లీకి వస్తే వాస్తవాలు చెబుతామన్నారు.

సంబంధిత పోస్ట్