లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలోని శ్యామల నర్సింగ్ హోమ్ లో శుక్రవారం డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 265 మందికి ఉచిత డయాబెటిస్ పరీక్షలు నిర్వహించగా 35 మందికి వ్యాధి డిటెక్టివ్ అయినట్లు క్లబ్ చైర్మన్ రవీందర్ శెట్టి తెలిపారు. షుగర్ తో బాధపడుతున్న వారు తీసుకోవలసిన ఆహారపు అలవాట్ల గురించి వివరించారు.