గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ

75చూసినవారు
గణేష్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ కోరారు. ధర్మారం మండలంలోని పలు వినాయక మండపాలను ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. డీజే సౌండ్ లు పెట్టి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగించవద్దని సీఐ కోరారు.

సంబంధిత పోస్ట్