ALERT: నేటి నుంచి 3 రోజులు వర్షాలు

64చూసినవారు
ALERT: నేటి నుంచి 3 రోజులు వర్షాలు
AP: రానున్న 3 రోజులపాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్