చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఈ ఐపీఎల్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. గైక్వాడ్‌కు ప్రత్యామ్నాయంగా 17 ఏళ్ల ఆయుష్ మాత్రేను చెన్నై జట్టు రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. 2024 సీజన్లో విజయ్‌హజారే ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ఆయుష్ కర్ణాటకపై తొలి మ్యాచ్‌లోనే 78 పరుగులతో అదరగొట్టాడు. తర్వాత నాగాలాండ్‌పై 181.. సౌరాష్ట్రపై 148 పరుగులు చేశాడు.