CSK తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మన గుంటూరు అబ్బాయి

63చూసినవారు
CSK తరఫున తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మన గుంటూరు అబ్బాయి
AP: గుంటూరు జిల్లా పాతమల్లాయపాలెంకు చెందిన రషీద్ CSK తరఫున ఆడుతున్నారు. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. కొడుకు ఘనతను చూసి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. రషీద్ తండ్రి బాలీషావలి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారు. అండర్-14లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడంతో రషీద్ ఏసీఏలో భాగమై మంగళగిరిలో ఉండాల్సి వచ్చింది. రషీద్ కోసం తండ్రి ఉద్యోగం మానేసి ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేవారు. ఖాళీ సమయంలో కూలీ పనులకు వెళ్లేవారు.

సంబంధిత పోస్ట్