AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలో ఉ.11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఆర్డీఏ, నూతన అసెంబ్లీ, అమరావతి, హైకోర్టు భవనాల నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలను కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్సుంది.