AP: వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమం చేపట్టనుంది. ఈ మేరకు కలెక్టర్లకు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యదర్శి కె.భాస్కర్ సర్క్యులర్ జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 250కి పైగా వాట్సప్ గవర్నెన్స్ సేవలపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేయనున్నారు.