AP: ఎన్టీఆర్ జిల్లా మూలపాడు సమీపంలోని కృష్ణా నదీ తీరంలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం అక్కడ పెదలంక, చినలంక గ్రామాల పరిధిలో 1,600 ఎకరాల్ని ప్రాథమికంగా గుర్తించింది. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తున్న ఇబ్రహీపట్నం పరిధిలోని భూములను మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు. స్పోర్ట్స్ సిటీలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన.