అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

66చూసినవారు
అంగన్వాడి కేంద్రాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని పొలాస సెక్టర్, జాబితాపూర్ సెంటర్ 3, కల్లెడ సెక్టర్ బాలపెల్లి అంగన్వాడి కేంద్రాల్లో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి తెలంగాణ సాంస్కృతికి అనుగుణంగా తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి పూజలు నిర్వహించి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు మోటూరి స్వరూప, మోటూరి కళావతి, టీ కవిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్