ఎమ్మార్పీఎస్ ఉద్యమా పోరాటాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కన్వీనర్ నక్క సతీష్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాయికల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దొబ్బల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంద సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.