మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా పాము కాట్లకు గురైతుండడంతో శుక్రవారం పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్, మండల అధ్యక్షులు కొమ్ముల రాజుపాల్ రెడ్డి తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ నలుగురు విద్యార్థులు పాముకాటుకు గురి కావడం ఇద్దరు విద్యార్థులు మరణించడం దురదృష్టమన్నారు.