జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గోవిందంగిరి నగర్ కాలనీలో దుర్గామాతకు ఆదివారం రాత్రి వివిధ రకాల పూలు గులాబీ, చామంతి, బంతి పువ్వులతో అమ్మవారికి పట్టణ పురోహితులు దివాకర్ శర్మ గారి ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించడం జరిగింది. దుర్గామాత పూజ అనంతరం తీర్థప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చిలువేరి రామకృష్ణ, గుండేటి ప్రసాద్, గాజెంగి శేఖర్, మోటూరి ప్రవీణ్ కుమార్, చిలుక రామకృష్ణ, భరత్, ఇంజనీర్ మచ్చ మురళి, వడ్ల రాజేందర్, పిన్నం సెట్టి భానుమూర్తి, మహేందర్, మారుతి, ప్రణయ్, నరేష్, గోవింద నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.