నీట్ పరీక్షల వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. నీట్ రగడపై పార్లమెంట్ వేదికగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఈ ఎన్టీఏ ఏం చేస్తుందనే విషయంపై తమ డిమాండ్లను లోక్‌సభ, రాజ్యసభ ముందుంచుతామని చెప్పారు. నీట్ వివాదం, ప్రశ్నాపత్రాల లీకేజ్, నీట్-యూజీ పరీక్ష రద్దు వంటి అంశాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.