భారీ వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో బ్రహ్మపుత్ర (వీడియో)

54చూసినవారు
అసోం రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా భారీ వరదలు పోటెత్తాయి. దీంతో బ్రహ్మపుత్ర నదికి వరద పెరిగింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్