జలాభిషేక్ యాత్ర.. ఇంటర్‌నెట్ నిలిపివేత

61చూసినవారు
జలాభిషేక్ యాత్ర.. ఇంటర్‌నెట్ నిలిపివేత
హర్యానాలోని నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్‌తో పాటు బల్క్ SMS సేవలను అక్కడి ప్రభుత్వం ఆదివారం నిలిపి వేసింది. సోమవారం సాయంత్రం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 31న బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్రలో హింస చెలరేగింది. ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, కనీసం 200 మంది గాయపడ్డారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇంటర్‌నెట్ నిలిపివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్