ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన జేపీ నడ్డా

67చూసినవారు
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన జేపీ నడ్డా
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఫలితాలు వెల్లడించాయన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ సింగిల్‌గా 370 లోక్‌సభ సీట్లు సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించి మరోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్